logo
సాధారణ వార్తలు

14లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావలంటూ జగన్‌కు కోర్టు ఆదేశం

లండన్‌లో ఉన్న పెద్ద కుమార్తెను చూడటం కోసం వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లగా.. సీబీఐ కోర్టు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే లండన్‌ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు వైఎస్‌ జగన్‌కు సూచించింది. నవంబర్‌ 14వ తేదీలోపు తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

Continue Read
సాధారణ వార్తలు

తిరుమల శ్రీవారికి అక్టోబర్‌ నెలలో రూ.119.35 కోట్లు హుండీ ఆదాయం

తిరుమల శ్రీవారిని అక్టోబర్‌ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వెల్లడిరచారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా శ్రీవారికి హుండీకి రూ. 119.35 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్‌లో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని పేర్కొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

సొంత నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంపై చెప్పులు, రాళ్లతో దాడి..

బిహార్‌ ఉప-ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్‌ కుమార్‌ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న లఖిసరై నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం విజయ్‌ కుమార్‌పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. అంతటితో ఆగకుండా, ‘ముర్దాబాద్‌’ నినాదాలు చేస్తూ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

అర్ధరాత్రి ఆమె బయటకెందుకు వెళ్లింది :అత్యాచార బాధితురాలిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కోయంబత్తూరులో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈక్రమంలోనే నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ప్రజలంతా డిమాండ్‌ చేస్తుండగా.. అధికార డీఎంకే మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఈఆర్‌ ఈశ్వరన్‌ మాత్రం విచిత్రంగా స్పందించారు. అసలు రాత్రి పూట ఆ అత్యాచార బాధితురాలు బయటకు ఎందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Continue Read
నేరలు

ఆంధ్ర`ఒడిసా ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు దగ్ధం : డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఆంధ్ర ఒడిసా ఘాట్‌ రోడ్‌లో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుండి ఒక్కసారిగా పొగలతో కూడిన మంటలు రేగి బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై బస్సును  నిలిపివేయడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ వెంటనే కిందకు దిగిపోయారు.

Continue Read
సాధారణ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భోగాపురం, ఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ, ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు

: లండన్‌ లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ బహుళజాతి సంస్థ రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల శ్రీవారికి భారీ వెండి కానుక

హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు మంగళవారం (నవంబర్‌ 4) తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళా న్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న శ్రీనివాసులు రెడ్డి.. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే వెండి గంగాళాన్ని విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు.

Continue Read