తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్
అక్షర కిరణం (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మంగళవారం తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఇంచార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తాడెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎన్హెచఎం మాతృ ఆరోగ్యం, పోషణ విభాగం 102 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు (డ్రాప్ బ్యాక్ సేవలు) అందించేందుకు రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ వాహనాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ప్రసవించిన తల్లులు, వారి నవజాత శిశువులను సురక్షితంగా వారి నివాసాలకు సకాలంలో పంపించుటకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను అత్యాధునిక సౌకర్యాల తో ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో మాతృ, శిశు మరణా లను తగ్గించవచ్చునని, లబ్ధిదారులకు డబ్బు ఆదా అవుతుం దని తెలిపారు. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వమని, విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్. సూపరింటెండెంట్ జి.సౌమిని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అప్పలనాయుడు, 102 డిస్ట్రిక్ కోఆర్డినేటర్ విజయకుమార్, డిప్యూటీ డెమో కె.యర్రన్న, డిప్యూటీ హెచఈఓ పి.మోహిని రత్నకుమారి పాల్గొన్నారు.