ఆక్వా రైతులకు రూ.1.50లకే యూనిట్ విద్యుత్..
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
అక్షర కిరణం, (పాలకొల్లు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి ఏపీ ఎనర్జీ డిపార్టు మెంట్ జీవో ఆర్టీ నంబర్ -57ను మంగళవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆక్వా రైతు లకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించనున్నారు. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత ఉన్న ఆక్వా ఫారాలకు ఈ రాయితీ సౌకర్యం కల్పిస్తున్నారు. మరోవైపు ఏపీ ఎసఏడీఏ, సీఏఏ చట్టాల కింద రిజిస్టర్ అయ్యి ఉండి.. అన్ని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు ఈ విద్యుత్ రాయితీ సౌకర్యం కల్పిస్తున్నారు.
రాష్ట్రంలోని సుమారు 6,500 ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ పొందే ఆక్వా ఫారాలకు.. రిజిస్ట్రేషన్ తేదీ నుంచి విద్యుత్ రాయితీ సౌకర్యం కల్పిస్తారు. మరోవైపు 2026 జూన్ ఒకటో తేదీ నుంచి అక్వా రైతులకు విద్యుత్ రాయితీని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆక్వా ఉత్పత్తి వ్యయం పెరిగి ఆక్వారైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో వారి కి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. అలాగే ఆక్వా రైతుల వివరాలను ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ, విద్యుత్ డిస్కంలకు అందించనుంది.
మరోవైపు పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో.. ఏపీ మంత్రులు జీవో నెం.57 విడుదల చేశారు. మంత్రి అచ్చెన్నా యుడు మాట్లాడుతూ జోన్, నాన్‌జోన్‌తో సంబంధం లేకుండా, పదెకరాల పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఆక్వా రైతుకూ యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందిస్తు న్నట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో ఆక్వా విద్యుత్ సబ్సిడీకి కేవలం రూ.724 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే విద్యుత్ సబ్సిడీ కోసం రూ.1,150 కోట్లు కేటాయించినట్లు వివరిం చారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఎన్నికల మేనిఫె స్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని అచ్చెన్నాయ్న్నడు తెలిపారు. పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల సాయం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లకు రూ.20 వేల ఆర్థిక లబ్ధి అందిస్తూ ప్రజా సంక్షేమంలో రికార్డు సృష్టించామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రమంగా దారిన తెస్తూ, సకాలంలో జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నట్లు వివరించారు. ఆక్వా రైతుల కోసం ఆక్వా ఫీడ్ ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని.. వైసీపీ ప్రభుత్వం తొలగించిన ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీ భారాన్ని, విస్మరించిన ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులకు రూ.27 కోట్ల బకాయిలు చెల్లించి గాడిలో పెడుతున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.