ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు దరఖాస్తు గడువును పెంచింది. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 22తో గడువు ముగియనుండగా.. మరో రెండు రోజులు గడువు పెంచారు. రాష్ట్రంలో మొత్తం 3,650 మద్యం షాపుల లైసెన్స్‌ల రెన్యువల్ కోసం ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు.
Continue Read
విశాఖలో త్వరలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త హోటళ్ల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
Continue Read
ఉత్తరాంధ్రలో కొత్తగా మరో పోర్టు ఏర్పాటు కాబోతోందన్నారు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇచ్చాపురం నియో జకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించామని.. 2వేల ఎకరాల్లో తీర ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలి పారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ఉల్లిపాయల నుంచి నూనె వరకు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయ లేని పరిస్థితులు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించాలని ఏర్పాట్లు చేయనున్నారు.
Continue Read
: దేశంలో ఈ 20 పెట్రోల్ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ ఈ 20 పెట్రోల్ వాడకంపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఈ 20 పెట్రోల్ వినియోగంతో పాత వాహనాల్లోని కొన్ని స్పేర్ పార్ట్స్ మార్చాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫ్యూయల్ హోస్‌లు, సీల్స్, ఓ రింగులు వంటి భాగాలు గట్టిపడటం, ఉబ్బడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమా వేశంలో ‘నేతన్న భరోసా’ పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు సంవత్సరా నికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
Continue Read
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 641 కోట్లు మంజూరు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆరో రోజు.. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIదీజ) ప్రతినిధులతో మెల్‌బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్‌లో నిర్వహిం చిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
Continue Read