విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు 20 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Continue Read
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులతో కలిసి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు.
Continue Read
తిరుపతిలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించే సమయంలో.. బీపీ డౌన్ అయ్యి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది.. ఆనం కింద పడకుండా పట్టుకున్నారు. అనంతరం వైద్యులు ప్రాథమిక వైద్య చికిత్స అందించారు
Continue Read
రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ స్థాయిలో మేలు చేకూరుస్తున్నాయో చాటిచెప్పేలా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల స్టాళ్లు నిలిచాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో భాగం గా ఏర్పాటు చేసిన ప్రదర్శనా స్టాళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు.
Continue Read
స్వాతంత్య్ర సమర యోధుల ప్రాణ త్యాగాలు, పోరాటాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భారత దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని పోలీస్ గ్రౌండ్‌లో రాష్ట్ర మంత్రి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Continue Read
స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణా లర్పించిన మహనీయుల త్యాగాలను, వారు పాటిం చిన రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ స్మరించుకో వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు నిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
Continue Read
స్వాతంత్య్రానికి జాతీయ జెండా ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమన్నారు చంద్రబాబు. జాతీయ జెండా ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్‌కు మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం ఒక్క రోజులో, ఒకరి పోరాటంతో రాలేదన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం.. ఎన్నో తరాల ఉద్యమంతో వచ్చింద న్నారు
Continue Read
ప్రపంచం భారత్ సాధించిన చారిత్రక విజయాలవైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతి కోసం ‘ సప్తధార ’ రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు.
Continue Read