ఏపీలో 34శాతం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
అక్షర కిరణం, (ఢిల్లీ/అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం బీసీ రిజర్వేషన్లకు నో చెప్పింది. ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది.. 34శాతం బీసీ రిజర్వేషన్లను నిరాకరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.. డెడికేటెడ్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ఎక్కడుందని జస్టిస్ దీపాంకర్ దత్తా, శీల్నాగ్తో కూడి ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వడంతో.. ఏపీ ఎన్నికల సంఘం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
ఏపీ ప్రభుత్వం బీసీలకు 34శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ జీవోను జారీ చేసింది. అయితే బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టు పిల్ దాఖలయ్యింది.. విచారణ జరిపిన హైకోర్టు సీజే జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం జీవోలను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని.. తాజాగా ఏపీ ప్రభుత్వం కల్పించిన ఈ రిజర్వేషన్లు సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల్లో జరపాలని హైకోర్టు ధర్మాసనం గత వారం ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోల ను కొనసాగించేలా చూడాలని కోరింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఏపీ ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది. తీర్పు సానుకూలంగా లేకపోయినా ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు మొగ్గు చూపుతోంది. ఒకవేళ రిజర్వేషన్లను కోర్టులు సమర్థించకపోతే పార్టీపరం గా బీసీలకు కోటా అమలు చేస్తామని కూటమి పార్టీలు చెబుతున్నాయి. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు దసరా తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవ కాశం ఉందంటున్నారు. మొత్తం మీద సుప్రీం కోర్టు బీసీల కు 34శాతం రిజర్వేషన్లపై నో చెప్పింది.. మరి పార్టీలు ఈ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తాయన్నది చూడాలి.