logo
సాధారణ వార్తలు

10 పోలీసు బృందాలు, 3 రాష్ట్రాల్లో సోదాలు.. సత్యనికేతన్ పీజీ యజమాని అరెస్ట్

ఢిల్లీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల పీజీ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పీజీ యజమాని పరారీలో ఉండగా.. 26 గంటల పాటు 10 పోలీసు బృందాలు, 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి మరీ పీజీ యజమాని హరిరామ్ భన్సాల్‌ను పోలీసులు రాజస్థాన్ లోని భివాడీ వద్ద అరెస్ట్ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

మూడు ట్రిప్పులకే ప్రయాగ్‌రాజ్ టు విశాఖపట్నం రైలు రద్దు

: ఉత్తరాంధ్రవాసుల కోసం ఏర్పాటు చేసిన ప్రయాగ్‌రాజ్--విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు మూడు రోజుల ముచ్చటగా మిగిలిపోయింది. నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడిపిన ఈ ప్రయాగ్‌రాజ్--విశాఖ పట్నం-ప్రయాగ్‌రాజ్ రైలును రద్దు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త 12 పీఆర్సీ నియామకానికి ఆమోదం

రాష్ట్ర ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేతన సవరణ సంఘం (Pay =వఙఱsఱశీఅ ్పుశీఎఎఱssఱశీఅ -P్పు=) ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఉత్తరాంధ్రలో కొత్తగా 2 వేల ఎకరాల్లో మరో పోర్టు    కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఉత్తరాంధ్రలో కొత్తగా మరో పోర్టు ఏర్పాటు కాబోతోందన్నారు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఇచ్చాపురం నియో జకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించామని.. 2వేల ఎకరాల్లో తీర ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలి పారు.

Continue Read
సాధారణ వార్తలు

మాధవస్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

మాధవధారలో వెలిసిన మాధవ స్వామి ఆలయంలో శనివారం ఆలయ అర్చకులు గోవిందస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం శనివారం కావడంతో వేకువ జాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

‘చకోర’ సినిమా టీజర్ రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం  ప్రేమ కథతో తెరకెక్కిన చకోర చిత్రం ఘన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను అలరించాలని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి దానంపై అవగాహన ర్యాలీ

: కంటి దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్, నాయుడుతోట ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Continue Read
నేరలు

గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు.. డీజీపీపై హైకోర్టు సీరియస్

మూడు నెలల కిందట గుంటూరులో పదో తరగతి బాలిక అదృశ్యంపై కేసు నమోదయింది. అయితే, బాలికను ఒక వ్యక్తి తీసుకెళ్లా డంటూ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల తమను పట్టుకోలేరంటూ ఆ వ్యక్తి పోలీసులు, బాలిక తల్లిదండ్రులకు సవాల్ విసరాడు. దాంతో బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఒకరోజు బాలికను హాజరుపరచాలంటూ నేరుగా డీజీపీనే బాలికను తీసుకురావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Continue Read