సాలూరులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
Åగిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక ఆదివాసీ దినోత్సవం Åరాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలలో భాగంగా 4వ.రోజు సాలూరు పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను 10,000 వేల మంది గిరిజనలతో కలిసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భారీ ర్యాలీ నిర్వహించి, సాంస్కృతిక, థింసా నృత్యాలు చేస్తూ గిరిజన నాయకులతో కలిసి మంత్రి సంధ్యారాణి మంగళవారం సందడి చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 4వ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వ హించుకోవడం నా భూతో- నా భవిష్యత్ అని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈసందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సోదర సోదరీమణులారా ప్రపంచ ఆదివాసి దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక కాదనీ, మన గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక, చరిత్రకు గౌరవం, హక్కులకు గుర్తింపు, భవిష్యత్తుకు భరోసా అని అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని ఆదివాసి సమాజాల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, హక్కులను గౌరవించ డానికి ప్రత్యేక ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రకటించిందని తెలిపారు,వేల సంవత్సరాలగా ప్రకృతిని దేవతగా భావించి, అడవిని తల్లిగా చూసి, నీటిని జీవంగా భావించి, జీవ వైవిద్యాన్ని కాపాడుతూ జీవించిన సమాజం మన గిరిజన సమాజంమని, రాష్ట్ర అభివృద్ధిలో గిరిజనుల పాత్ర ఎంతో గొప్పది, మన్యంలోని ప్రతి కొండ, అడవి, గిరిజన గ్రామా లు ఒక గొప్ప చరిత్రను కలిగిఉన్నాయన్నారు. అది అంటే మొదట.. వాసి అంటే నివసించే వారు అని అన్నారు. ఈ భూమిపై తొలి నుంచి జీవిస్తున్నవారే ఆదివాసీలని అన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూ.1000 కోట్లతో అడవి తల్లి బాట పేరుతో అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. ఈకార్యక్రమంలో సాలూరు పట్టణ అధ్య క్షులు, మండల అధ్యక్షులు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.