ఆంగ్లభాష పరిశోధనల్లో పైడి రజనికి పీహెచ్డీ
సర్టిఫికెట్ అందజేసిన ఏయÖ వీసీ
అమెరికన్ యÖనివర్శిటీ ప్రశంస
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రా యూని వర్శిటీలో ఆంగ్ల విభాగంలో పైడి రజని చేసిన పరిశోధన లకు పీహెచ్‌డీని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ నుంచి మంగళవారం అందుకున్నారు. ఆంధ్రా యూని వర్శిటీలో ఎంఏ, ఎంఐడీ పూర్తి చేసిన ఈమె పలు కళా శాలల్లో లెక్చరర్‌గా, ఇంగ్లీష్ విభాగాధిపతిగా పనిచేశారు. శక్తి ఎంపరింగ్ ఉమెన్ అసోసియేషన్ (సేవ) సంస్థతో అనేక సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్న ఈమె వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే తమ పరిశోధనలను చేశారు. స్త్రీవాదం, స్త్రీవిముక్తివాదం, పురుషులతో సమానంగా హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛ, సమాజపు గౌరవం, సామాజిక న్యాయంపై పైడి రజని అద్భుతమైన రీతిలో పరిశోధనలు చేశారు. సాహిత్యంలో స్త్రీల అనుభవాలు, అణచివేత, పితృస్వామ్యం, లింగ అసమా నతలు, వ్యక్తిత్వం, స్వాతంత్య్రంపై ప్రతిబింబించే అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు, అమెరికన్ యూనివర్శిటీ ప్రశంస లు అందుకున్నారు. ఒంటరితనం, పరాయీకరణ లాంటి అంశాల్లో సమాంలో సంబంధ బాంధవ్యాలు, సంస్కృతి, స్వతంత్ర జీవన విధానంలో మానసిక పరిస్థితులపై చేసిన అధ్యయనం వైవిధ్యభరితంగా రజని రచనాశైలి, పరిశోదన ఉందని అమెరికన్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు తుది నివేదిక లో ప్రశంసించడం చారిత్రాత్మక అంశం. తాను చేసిన పరిశోధనలకు సహకరించిన విద్యావేత్తలు, వివిధ రంగాల మహిళలు, పౌర సమాజానికి పైడి రజని కృతజ్ఞతలు తెలి పారు. ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ అందుకోవడం ఓ మధురానుభూతి అని పేర్కొన్నారు.