logo
సాధారణ వార్తలు

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్

ఏపీ కేడర్‌కు చెందిన ప్రసన్న వెంకటేష్‌కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి డైరెక్టర్‌గా నియమించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న వెంకటేష్ ఏపీ కేడర్ 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు ఎన్టీఏ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

Continue Read
నేరలు

పోక్సో నిందితుడికి బాలికల పాఠశాలలో జాబ్ 22 మంది విద్యార్థినులను లైంగిక వేధించిన గణపత్ అరెస్టు

మహారాష్ట్ర లోని ఠాణె జిల్లాలో గల ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. పాఠ శాలలోని 22 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల వంటవాడు గణపత్ గవిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖ జిల్లాలోని మారికవలసలో ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్స్ సెంటర్ సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కమిషనర్ గౌతమి తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

జిల్లాలో ఎరువుల కొరత లేదు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం ఎమ్మెల్యే వంశీకృష్ణ

జర్నలిస్టుల సమస్యలను పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గురువారం ద్వారకానగర్‌లోని ఓ ీVAటల్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యÖనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయÖడబ్ల్యుజే) 70వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పెండింగ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఉత్తరాంధ్రకు పోలవరంతో గోదావరి జలాలు..

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కల సాకారం కాబోతోంది.. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లను అందించేందు కు కీలక ముందడుగు పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్య మంత్రి చంద్రబాబు గోదావరి జలాల కు హారతి ఇవ్వనున్నారు. దీని కోసం ముందుగా ట్రయల్ రన్ నిర్వహిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

అన్నా క్యాంటీన్‌లో  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తనిఖీలు

కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో ప్రజా దర్బార్ కార్యక్ర మంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మంత్రి.. అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు.

Continue Read