కెమికల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆయుధ పూజ
అక్షర కిరణం, (కంచరపాలెం): కనకదుర్గ అమ్మవారు ఆశీస్సులతో, విద్యార్థులకు, అధ్యాపకులకు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు అంతా మంచి జరగాలని, విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.రమణ ఆకాంక్షించారు. శుక్రవారం దసరా ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించి కళాశాలలో ఆయుధ పూజ నిర్వహించారు. టెక్నికల్ కళాశాల విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, యంత్రాలతో కూడిన విధి నిర్వహణ వల్ల అమ్మవారి దయ ఎప్పుడు ఉండాలని ప్రార్థిం చారు. విద్యార్థులు వర్క్ షాప్‌ను అందంగా అలంకరించి, వేదమంత్రాలతో ఆయుధ పూజ నిర్వహించారు. కార్యక్రమం లో వర్క్‌షాప్ సూపరింటెండెంట్ డాక్టర్ కే రాజు, వర్క్‌షాప్ సిబ్బంది సూర్యనారాయణ, శంకర్ రావు, రవి పాల్గొన్నారు.