రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
అక్షరకిరణం, (పలాస): పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి స్కూటీ బోల్తా పడడంతో అంబుసోలి గ్రామానికి చెందిన కొమ్మల సత్యతోపాటు చీమల కల్పనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పలాస ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రథóమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.