బదిలీ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 8 సంవత్సరా లుగా విద్యార్థులకు చదువు చెబుతూ ఈఏడాది వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం ఘనంగా సన్మానించారు. టీచర్స్ డేను పురస్కరించుకొని నిర్వహించిన సన్మానంలో ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్, స్టాండిరగ్ కమిటీ మెంబర్ దాడి వెంకట రమేష్ హాజరై వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రత్నమాల, ఇతర ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు