ఘనంగా పైడితల్లి వారి చండీహోమం
అక్షర కిరణం, (విజయనగరం): ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీహోమం మంగళవారం వనం గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. మూడవ మంగళ వారాన్ని పురస్కరించుకొని ఈ హోమాన్ని నిర్వహించారు. ప్రతీ మూడవ మంగళవారం చండీ హోమాన్ని నిర్వహిం చడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.