జీఎం సందీప్ మాథుర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ 2025’ డ్రైవ్
అక్షర కిరణం (విశాఖపట్నం): స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛతా హీ సేవా (ఎస్హెచ్ఎస్) 2025 9వ ఎడిషన్ గురువారం ప్రారంభమైంది. 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేసుకుంటున్న 15 రోజుల ప్రచారం గాంధీ జయంతి రోజుతో ముగుస్తుంది. సమర్థవంతమైన పరిశుభ్రత కార్యక్రమాల దిశగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని సమీకరించడం దీని లక్ష్యం.
సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్సీఓఆర్) జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ విశాఖపట్నంలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో ‘స్వచ్ఛతా హీ సేవా డ్రైవ్‌కు నాయకత్వం వహించారు. బి. చంద్రశేఖర్, ఓఎస్డీ, ఏస్స్సీఓఆర్తోపాటు అధికారులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, కాలనీ నివాసితులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా సందీప్ మాథుర్ పాల్గొన్న వారందరితో స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేయించారు. పరిశుభ్రత స్థిరమైన పౌర పద్ధతులపై సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటిం చారు. సభికులను ఉద్దేశించి ప్రసంగించిన జనరల్ మేనేజర్, రైల్వే వ్యవస్థ దేశం అంతటా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా 2025 ప్రచారం, రైల్వే సిబ్బంది, పౌరులు, కమ్యూ నిటీ గ్రూపులు, ఎన్జిఓలను ఒకచోట చేర్చిందని చెప్పా రు. ‘పరిశుభ్రత లక్ష్య యూనిట్లు -తీవ్రమైన చెత్తను శుభ్రపర చడం పరివర్తన కోసం గుర్తించిన చీకటి, మురికి నిర్లక్ష్యం చేసిన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడుతోందని తెలిపారు.