కలెక్టర్ కార్యాలయంలో ఉత్సాహంగా ‘స్వచ్ఛోత్సవ్’
అక్షరకిరణం, (విశాఖపట్నం): పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జిల్లాలో ‘ఏక్ దిన్. ఏక్ గంట. ఏక్ సాథ్’ కార్యక్రమాలు గురువారం ఉత్సాహంగా జరిగాయి. విశాఖ కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్వయంగా పాల్గొని, పరిసరాలను శుభ్రపరిచి, చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో భవానీ శంకర్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.