సీతన గార్డెన్స్‌లో
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
బాల త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారి దర్శనం
ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ప్రత్యేక పూజలు
అక్షర కిరణం, (మాధవధార): జీవీఎంసీ 51వ వార్డు మాధవధార సీతానగార్డెన్స్‌లో వెలసిన కనక మహా లక్ష్మి, గాయత్రీ దేవి, దుర్గాదేవి ఆలయంలో సోమవారం శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సనపల కీర్తి మొదటి పూజ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.