జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్‌గా సత్యనారాయణ రాజు
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన ఇంజినీర్‌గా పీవీవీ సత్యనారాయణ రాజు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఇంజనీర్ విభాగంలో బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మౌలిక వసతుల కల్పనకు నిత్యం కృషి చేస్తానని అన్నారు. అనంతరం విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.