కోదు పెద్దవలసలో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి
అక్షర కిరణం, (సాలూరు): కోదు పెద్దవలస గ్రామంలో తక్షణమే పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆరు బయటే విద్యార్థుల చదువులు కొనసాగుతు అత్యంత దయనీయంగా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీ కోదు పెద్దవలస గ్రామంలో తక్షణమే స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలనీ విద్యార్థులు, తల్లి దండ్రులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ్దకు వెళ్లి పీజీఆర్ఎస్లో తమకు స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వారికి మద్దతుగా పీడీఎస్వో సభ్యులు పాల్గొన్నారు. పీడీఎస్వో జిల్లా అధ్యక్షుడు కె.సోమేష్ మాట్లాడుతూ కోదు పెద్దవలస గ్రామంలో నలుగురు ఉపాధ్యాయులు, 53 మంది విద్యార్థులతో మోడల్ స్కూల్, 1 నుంచి 5వ తరగతి వరకు 153 మంది విద్యార్థుల నడుమ నడుస్తున్నప్పటికీ దానికి సొంత బిల్డింగ్ లేక విద్యార్థులు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చింతచెట్లు కిందనే, చదువులు అసలే వర్షాల టైమ్, ఇంటి గడపల్లో పాఠాలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు స్కూల్ బిల్డింగ్ ఉన్న 2013లో కూలిపోయిందని, తరువాత మళ్లీ బిల్డింగును ఏర్పాటు చేయలేదని తెలిపారు. 12 సంవత్స రాల కాలం నుండి విద్యార్థులు చదువులు ఆరుబయటనే సాగు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వెంటనే పాఠశాల బిల్డింగు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్వో జిల్లా కమిటీ అధ్యక్షులు కె.సోమేష్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, రైతు కూలీ సంఘాల నాయకులు ఎం.ప్రసాద్. పి.అసిరి. విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామస్థులు పి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.