తిరుమల మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ర్యాలీ
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): వరల్డ్ హార్ట్ డే సందర్బంగా విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు లకు భారీ ర్యాలీ నిర్వహించారు. కోట నుండి తిరుమల మెడికవర్ హాస్పిటల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా ఎస్పీ ఏఆర్ దామోదర్, మనసస్ కరెస్పాండంట్ కేవీఎల్పీ రాజు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. 000 మంది వరకు ర్యాలీలో పాల్గొన్నారు. తిరుమల మెడికవ్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ శరత్ కుమార్ పాత్ర, డాక్టర్ కిరణ్, దుర్గాప్రసాద్, తిరుమల మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.