ఆర్ఎస్ఎస్ను తక్షణం బ్యాన్ చేయాల్సిందే: సర్దార్ పటేల్ చేసింది అదే
కకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే
కపటేల్ వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసిన ఖర్గే
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ఆరెస్సెస్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కువ గా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆరెస్సెస్) కారణమని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ హత్య తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఇదే చేశారని చెప్పారు. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్‌ను నిషేధిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను ఖర్గే ఈసందర్భంగా గుర్తుచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పికొట్టారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులు అలా చేయొద్దు:
సర్దార్ పటేలు వ్యాఖ్యలు గుర్తు చేసిన ఖర్గే
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఆరెస్సెస్ కోసం పనిచేయొద్దని సర్దార్ పటేల్ పటేల్ చెప్పిన మాటలను ఈసందర్భంగా ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్, జమాత్ ఏ ఇస్లామి వంటి సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనకుండా పటేల్ నిషేధం విధించారని గుర్తుచేశారు. అయితే మోదీ ప్రభుత్వం గతేడాది జులైలో ఆ నిషేధం ఎత్తివేసిందన్నారు. దేశం కోసం పటేల్ చాలా సేవ చేశారని.. ఆయన మరణాన్ని మిఠాయిలు పంచి ఆరెస్సెస్ వేడుకలా చేసుకుంటోందని ఈ విషయాన్ని ఓ లేఖలో స్వయంగా సర్దార్ పటేల్ పేర్కొన్నారని ఖర్గే చెప్పారు. అందుకే ఆరెస్సెస్‌ను నిషేధించారని తెలిపారు. ఆరెస్సెస్, హిందూ మహాసభ సిద్ధాంతాలే మహాత్మ గాంధీ హత్యకు కారణమని ఈసందర్భంగా తెలిపారు. కాగా ఇటీవల ప్రియాంక్ ఖర్గే కూడా ఆరెస్సెస్‌ను బ్యాన్ చేయాలని కర్ణాటక సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్రం నుంచి స్పందన రావాల్సి ఉంది.