ప్రకృతి ప్రేమికుడు, సామాజిక సేవకుడు కొత్తపల్లి పద్మనాభాచారి కన్నుమూత
అక్షర కిరణం, (పలాస): ప్రకృతి ప్రేమికునిగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వేలాది వృక్షాలను ఏర్పాటుచేసి సామాజిక సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసుకున్న అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొత్తపల్లి పద్మనాభచారి (చిన్నాచారి) (59) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈయన విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకుడి గా అనేక సంఘాల ప్రతినిధిగా లలిత కళారంజని గౌరవ అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సినీ, టీవీ రంగాల్లో ఎంతోమంది కళాకారులను పరిచయం చేశారు. ఆయనకు భార్య ఇందిరా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన స్వగ్రామం పలాస మండలం లొద్ద భద్రలో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు చేశారు. ఈయన మృతికి లలిత కళారంజని అధ్యక్ష, కార్య దర్శులు మల్ల కామేశ్వరరావు, శివజ్యోతి, సంస్థ వ్యవస్థాప కులు కోశాధికారి పంట ఓం ప్రకాష్, మాజీ ఎంపీపీ కొయ్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి అప్పలరాజు దేశం నేత వజ్జ బాబురావు, విశ్వబ్రాహ్మణ సంఘ స్వర్ణకార సంఘ పలు వురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పిం చారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.