నారా లోకేష్‌తో సాహితీవేత్త గౌరీ నాయుడు బేటీ
కగురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని వినతి
అక్షర కిరణం, (విజయవాడ/విజయనగరం): మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ను యువ సాహితీవేత్త, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ కన్వీనర్, పిఠా పురం రాజా కళాశాల అధ్యాపకుడు, గ్రంథాలయ సేవా సంస్థ కన్వీనర్ డాక్టర్ కిలారి గౌరీ నాయుడు విజయ వాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్య వివాహాలు, వరకట్నం, మూఢనమ్మకాలు వంటి సాంఘిక దురాచారా లను సమాజంలో రూపుమాపడా నికి సాహిత్యంతో విశేష కృషి చేసి సమాజాన్ని చైతన్యవంతం చేసిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా అన్ని విద్యాసంస్థలలో నిర్వహించాలని నారా లోకేష్‌ని గౌరీ నాయుడు ప్రత్యేకంగా కోరారు. విజయ నగరంలో గురజాడ అప్పారావు నివసించిన ఇంటిని ఆధుని కీకరించాల్సిన ఆవశ్యకతను గౌరీనాయుడు లోకేష్‌కు వివ రించారు. గురజాడ సృష్టించిన సాహిత్యాన్ని, అధ్యయనం చేసిన గ్రంథాలను డిజిటలైజేషన్ చేయాలని ఈ సందర్భం గా విన్నవించారు. లండన్ మహానగరంలో షేక్స్పియర్ స్మారక కేంద్రం నిర్మించినట్లుగా విజయనగరంలో గురజాడ అప్పారావు పేరు మీద సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించటానికి వీలుగా సాహిత్య సాంస్కృ తిక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నారా లోకేష్‌ను కలిసిన అనంతరం గౌరీ నాయుడు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖుల జయంతి, వర్ధంతులను రాష్ట్ర పండుగ నిర్వహించేందుకు జీవోతోపాటు జాబితా విడుదల చేసిందని అందులో గురజాడ పేరు లేకపోవడం సాహిత్య అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిందని గౌరీ నాయుడు పేర్కొన్నారు. సెప్టెంబర్ 21 గురజాడ అప్పారావు జయంతికి ముందే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో గుర జాడ జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించేందుకు స్పష్ట మైన ప్రకటన జారీ చేసి గురజాడ సాహిత్య అభిమానులకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేలా ముఖ్యమంత్రి చంద్ర బాబు స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.