స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): స్మార్ట్ కార్డులు వలన లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను 2.76 లక్షల మందికి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు స్త్రీ శిశు సంక్షేమశాఖ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడి,్డ సబ్‌కలెక్టర్ వైశాలితో సంయుక్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి సంధ్యారాణి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ఉన్న రేషన్ కార్డుల వలన లబ్ధిదారులకు ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. సాలూరు మండలంలో సామాజిక పింఛన్లు 8 వేల మందికి అందుతున్నాయని తెలిపారు. కొత్తగా మరో 196 పింఛన్లు మంజూరైనట్లు ఆమె వెల్లడిరచారు. కార్యక్రమంలో సాలూరు మండల తహసీల్దార్ నేలకంఠరావు, ఎంపీడీవో పార్వతి, ఏఎంసీ చైర్మన్, సూర్యనారాయణ, మండల నాయకులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.