జేఎన్టీయూజీవీలో ఘనంగా మైఖేల్ పారడే జయంతి
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): జేఎన్టీ యూజీవీలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో విద్యుత్, విద్యుత్ చుంబ కత్వం తండ్రిగా పేరుగాంచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త మైఖేల్ ఫరడే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు, అధ్యాపకులు అతిథులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రధాన అతిథిగా ఏపీఈపీడీసీఎల్ రిటైర్డ్ సూప రింటెండిరగ్ ఇంజినీర్ రమణారావు, సర్టిఫైడ్ ఎనర్జీ ఆడిటర్ హాజరయ్యారు. ఆయన ‘ఎనర్జీ మేనేజ్మెంట్’పై నిపుణుల ప్రసంగం అందించారు. మైఖేల్ ఫరడే విద్యుత్, చుంబకత్వ రంగంలో చేసిన కృషిని గుర్తుచేశారు. విద్యార్థులు ఆవిష్క రణా స్పూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. శక్తి సంరక్షణ, పునరుత్పాదక వనరుల సమర్థ వినియోగం, విద్యుత్ సామర్థ్యం పెంపుదలపై దృష్టిపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించారు. ఇందులో ఈఈఈ విద్యార్థులు రూపొందించిన సృజనాత్మ క నమూనాలు, పని చేసే ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇందు లో ‘ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిస్టమ్’ ప్రథమ బహుమతి గెలుచుకోగా, ‘హై అండ్లో వోల్టేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్’’ రన్నరప్‌గా నిలిచింది. ప్రత్యేక ఆకర్షణగా పాఠశాల విద్యా ర్థులు కూడా తమ సైన్స్ మోడల్స్‌ను ప్రదర్శించారు. అదనం గా పోస్టర్ ప్రెజెంటేషన్స్, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీజే నాగరాజు విద్యార్థు లను శాస్త్రీయ పరిశోధన, సరికొత్త ఆవిష్కరణల వైపు ప్రేరేపించారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ వీఎస్. వకులా పర్యవేక్షించారు. కన్వీనర్ డాక్టర్ ఎ.పద్మజ సమ న్వయం చేశారు. స్టూడెంట్ కోఆర్డినేటర్లు కార్యక్రమాన్ని విజ యవంతం చేశారు. విభాగాధిపతి ప్రధాన అతిథి, అధ్యాప కులు, పాఠశాల విద్యార్థులు, విద్యార్థి సమన్వయకర్తలు నిర్వాహక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.