28వ వార్డులో తారు రోడ్ల నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురు వారం ఆయన జీవీఎంసీ 4వ జోన్ 28వ వార్డు పరిధిలోని రామ్ నగర్లో పలుచోట్ల తారు రోడ్డు నిర్మాణానికి తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వార్డ్ కార్పొరేటర్ పల్లా అప్పలకొండతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పల్లా దుర్గారావు, గొలగాని పోలారావు, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, జీవీఎంసీ కార్య నిర్వాహక ఇంజనీరు, ఉప కార్యనిర్వహక ఇంజనీరు, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు