సీఎం చంద్రబాబుకు మేయర్ పీలా ఘన స్వాగతం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విజయనగరం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖపట్నం విమానాశ్రయంలో బుధవారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు. ఇతర ప్రజాప్రతినిధులు విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ కార్పొరేషన్ చైైర్మన్ గండిబాబ్జీ, సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆరోగ్య విషయాలను స్వయంగా అడిగి తెలుసుకొని ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు.