అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్ పీలా శ్రీనివాసరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన 8 వ జోన్ 96వ వార్డ్‌లోని పలు ప్రాంతాలలో సుమారు రూ.142.60 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ వార్డుల అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. వార్డులోని ప్రగతి నగర్, లక్ష్మీ నగర్, దాడి అప్పారావు కాలనీ, అయ్యప్ప స్వామి గుడి, రాజ్ చెరువు తదితర ప్రాంతాలలో సుమారు రూ.142.60 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, సీసీ కల్వర్టులు, ఎస్డబ్ల్యూ కాలువలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, జోనల్ కమిషనర్ బి.హేమావతి, పర్యవేక్షక ఇంజనీరు శ్రీనివాసరావు, కార్యనిర్వహక ఇంజనీరు దిలీప్, ఉప కార్యనిర్వహణ ఇంజినీరు ప్రవీణ్, జీవీఎంసీ సిబ్బంది వార్డు అధ్యక్షులు పి రాజేంద్రప్రసాద్, హెచ్.రామకృష్ణ, శరగడం రాము, శరగడం శంకర్రావు, ఆళ్ల రమేష్ కిల్లి రమేష్, ఆళ్ల రాము, మాజీ గౌరవ సంఘం అధ్యక్షులు శరగడం నరసమ్మ, ఆల త్రినాధ్, ఆళ్ల గణబాబు, అంబిక గణేష్, శరగడం బుజ్జి అచ్చి రామకృష్ణ, నరవ అచ్చిబాబు కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.