పింఛన్లు పంపిణీ చేసిన మేయర్ పీలా శ్రీనివాసరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లతోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన 8వ జోన్ 96 వార్డు పరిధిలో వెలంపేట ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పించను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ఏపిడి చిరంజీవి, వార్డ్ సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శి, కూటమి నాయకులు గొర్లి రాము, వేగి పరమేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, కిల్లి రమేష్, బండారు నాగు, మౌళి తదితరులు పాల్గొన్నారు.