ఢల్లీిలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు: 10 మంది మృతి
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ఢల్లీిలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మరో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బాధితు లకు ూచీGూ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి 9 వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుకున్న ప్రధాన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసారు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు,
ఢల్లీి పేలుడులో అసలు సూత్రధారి లేడీ డాక్టర్..
భారత్‌లో జైషే మహిళా విభాగానికి ఈమే హెడ్!
దేశ రాజధాని ఢల్లీిలో జరిగిన పేలుడు యావత్తు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నవంబరు 10న సోమవారం సాయంత్రం ఎర్ర కోట వద్ద జరిగిన ఈ ఘటనలో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. అయితే, ఫరీదాబాద్‌లో భగ్నం చేసిన ఉగ్ర కుట్రతో దీనికి సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. జైషే ఉగ్రవాద సంస్థ ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన మహిళా విభాగానికి యూపీకి చెందిన లేడీ డాక్టర్ చీఫ్‌గా వ్యవహరిస్తోంది.
నవంబరు 10న హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున్న పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అదీల్ అహ్మద్ రథర్, ముజామిల్ షకీల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో లక్నోకు చెందిన షహీనా షాహిద్ అనే మహిళా వైద్యురాలిని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్‌లో మహిళా విభాగం ఏర్పాటు, నియామకాల్లో డాక్టర్ షహీనా కీలక పాత్ర పోషించినట్టు ఢల్లీి పోలీసు వర్గాలు వెల్లడిరచాయి. డాక్టర్ షహీనాకు జైషే మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’ భారత్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నాయి. పాక్‌లో ఈ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ చీఫ్‌గా వ్యవహరిస్తోంది. ఢల్లీి పేలుడులో ఆమె కూడా కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.
కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ యూసఫ్ అజార్‌కు సాదియా భార్య. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో యూసఫ్ కూడా ఒకరు.
అధికారులు తెలిపిన ప్రకారం డాక్టర్ షహీనా షాహీద్ లక్నోలోని లాల్ బాగ్‌కు చెందినవారు. ఫరీదాబాద్‌లోని జైషే ఉగ్ర కుట్ర భగ్నం చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాడులకు నిధులు, ఉగ్రవాద ఆపరేషన్లను సులభతరం చేయడానికి కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. షహీనాకు చెందిన కారులోనే ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అల్-ఫలాప్‌ా యూనివర్సిటీలో పనిచేస్తోన్న షహీనాకు.. కశ్మీర్ డాక్టర్ ముజామిల్ గనాయ్ అలియాస్ ముసైబ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఫరీదాబాద్‌లో అతడు అద్దెకు తీసుకున్న రెండు గదుల నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడం ముజామిల్‌ను అరెస్ట్ చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో కోయిల్‌కు చెందిన ముజామిల్ అల్ ఫలాప్‌ా యూనివర్సిటీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. శ్రీనగర్‌లో సైనికులను హెచ్చరిస్తూ జైషే మహమ్మద్‌కు మద్దతుగా పోస్టర్లు అతికించిన కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడంలో ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చింది. రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలను దాచిపెట్టిన కారును షహీనాదిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. విచారణలో అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా అమ్మోనియం నైట్రేట్‌గా భావిస్తోన్న 350 కిలోల పేలుడు సామాగ్రి, 20 టైమర్లు, ఇతరు అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.