యూటీఎఫ్ రణభేరి బైక్ జాతను విజయవంతం చేయండి కయూటీఎఫ్ నేత సబ్బారపు నూకరాజు
అక్షర కిరణం, (విశాఖపట్నం): యూటీఎఫ్ రణభేరి బైక్ జాతను విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గాజువాక మండలశాఖ ప్రధాన కార్యదర్శి సబ్బారపు నూకరాజు పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల వడ్లపూడిలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిóగా హాజరైన విశాఖపట్నం జిల్లా పూర్వ ప్రధాన కార్య దర్శి యూటీఎఫ్ సీనియర్ నాయకులు నెల్లి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉపాధ్యాయులకు భోధనేతర పనులు (ఆప్స్) రద్దు చేయాలని, పీఆర్సీ కమీషన్ ఏర్పాటు చేసి తక్షణం ఐర్ ప్రకటించాలని, పెండిరగ్ డీఏలు తదితర అన్ని రకాల ఆర్థిక పరమైన పెండిరగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో ఐదు ప్రాంతాల నుండి ఈ నెల 15 వ తేది నుండి 19 తేదీ వరకు ఈ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు రణభేరి కార్యక్రమం విజయవంతం చేయా లని మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఇమంది ప్రసాద్, సబ్బారపు నూకరాజు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయ కులు అప్పారావు, జిల్లా ఉపాధ్యాక్షులు విజయ కుమారి, జిల్లా కార్యదర్శి మహ్మద్ రిజ్వాన్, మండల గౌరవ అధ్యక్షులు మురళికృష్ణ, సహ అధ్యక్షులు అబ్దుల్ హక్, సుగుణ, ఎస్తేరు రాణి, మండల కమిటీ సభ్యులు లక్ష్మికుమారి, హుస్సేన్‌బీ, లక్ష్మి, నీరజ, విజయదుర్గ, సూర్యకుమారి, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.