లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎంపీ సీఎం రమేష్
అక్షర కిరణం, (అనకాపల్లి): అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన 33 సీఎంఆర్ఎఫ్ రూ.25,55,543 చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ సీఎం రమేష్ అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అపన్న హస్తం లాగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందన్నారు. ప్రజలకు అండగా నిలిచేందుకు సీఎం గతంలో ఎన్నడూ లేనంతగా సహాయాన్ని అందిస్తున్నారు.