జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు
అక్షర కిరణం, (అనకాపల్లి): అనకాపల్లి నియోజక వర్గ సత్యా గ్రాండ్ కళ్యాణ మండపంలో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.
కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆయన తోపాటు అనకాపల్లి, ఎలమంచిలి, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ పంచకర్ల సందీప్, చోడవరం నియోజవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు, నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్య చంద్ర, పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గంగులయ్య, అరకు నియోజవర్గం ఇన్చార్జ్ చిరంజీవి, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.