దివ్యాంగులకు ఎమ్మెల్యే శిరీష పింఛన్ల పంపిణీ
అక్షరకిరణం, (పలాస): కూటమి ప్రభుత్వంలో అసలైన దివ్యాంగులకు ఎటువంటి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 29వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నకిలీ దివ్యాంగ పత్రాలు పొందడంతో కొంత గందర గోళ పరిస్థితి ఏర్పడిరదన్నారు. దీనిపై నిజ నిర్ధారణకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు కూటమి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.
కణితి విశ్వనాథం విగ్రహాం ఆవిష్కరణ
డాక్టర్ కణితి విశ్వనాథం సేవలు మరువలేనివని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష అన్నారు. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వ నాథం విగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ పలాస ప్రాంతా నికి విశ్వనాథం చేసిన సేవలను ఆమె గుర్తు చేశారు. ఒక వైద్యునిగా, రాజకీయ నేతగా సమాజంలో తనకంటూ చెరగని ముద్ర ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేత వజ్జ బాబురావు, కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.