ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న ట్రావెల్ బస్సుల తనిఖీలు
అక్షర కిరణం, (మాధవధార): దసరా పండుగను పురస్కరించుకుని ట్రావెల్స్ బస్సుల యజమానులు ప్రయా ణికుల నుంచి టికెట్ల పేరుతో అధిక ధరలు వసూలు చేయ రాదని అధికారులు తెలిపారు. యజమానులు, డ్రైవర్లు నిర్దేశించిన పర్మిట్, టాక్స్ లేకుండా వాహనాలను రోడ్ల మీదకు తేరాదని స్పష్టం చేశారు. పర్మిట్ లేకుండా వాహనాలు రోడ్డుమీదకు తెచ్చి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత వాహన యజమానుల దేనని స్పష్టం చేశారు. రవాణా శాఖ నిర్దేశించిన రహదారి నిబంధనలను అనుసరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈక్రమంలో విశాఖపట్నంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు బృందాలుగా ఏర్పడి గాజువాక, విశాఖ పట్నంలో ముమ్మర తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తనిఖీలు మునుముందు కూడా కొనసాగు తాయని అధికారులు తెలిపారు. మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీలలో 28 కేసులు బుక్ చేసినట్టు తెలిపారు. వాటి నుంచి ఇప్పటి వరకు టాక్స్, పెనాల్టీ రూపం లో రూ.4,82,000 వసూలు చేసినట్టు తెలిపారు.