విద్యార్థులు ఆలోచించగలిగితే ప్రశ్నించేతత్వం అలవడుతుంది
కఇంటర్ విద్య డీవీఈవో ఆర్.సురేష్ కుమార్
అక్షరకిరణం (పలాస): విద్యార్థులు ఆలోచించగలి గితే వారిలో ప్రశ్నించేతత్వం అలవడుతుదని, ఈ దిశగా అధ్యాపకులు చొరవ చూపాలని ఇంటర్ విద్య డీవీఈవో ఆర్. సురేష్ కుమార్ అన్నారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం సందర్శించిన ఆయన అధ్యాపకులతో మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటినుంచే ఉత్తమ ఫలితాల దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకుల రికార్డులను, కళాశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉజ్వల భవితకు ఇంటర్ పునాది కావాలని ఇందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.