పారా వాలీబాల్ వరల్డ్ కప్‌కు ఎంపికైన గణేష్‌కు
హోం మంత్రి అనిత అభినందన
అక్షర కిరణం, (నక్కపల్లి): అమెరికాలో అక్టోబర్ 12 నుంచి జరగనున్న పారా వాలీబాల్ వరల్డ్ కప్‌కి ఎంపికైన క్రీడాకారుడు అన్నం గణేష్‌ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఎస్.రాయవరం మండలంలోని సోముదేవుపల్లికి చెందిన గణేష్ నక్కపల్లి మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి అనిత గణేష్‌కు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. చిన్ననాటి నుంచే పారా స్పోర్ట్స్‌పై ఆసక్తితో కృషి చేస్తూ ఉన్న గణేష్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం గర్వకారణమని మంత్రి అనిత పేర్కొన్నారు. పారా వాలీబాల్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలంటూ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వ సహాయాన్ని కూడా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈకార్యక్రమంలో రాయవరం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షు లు అమలకంటి అబద్దం, బీజేపీ స్టేట్ ఎక్స్ సర్వీస్ మెన్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు, బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోసూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.