ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోం మంత్రి అనిత క్లాస్
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): విజయ నగరం జిల్లా చింతలవలసలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి వంగలపూడి అనిత క్లాస్ తీసుకు న్నారు. చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అనిత గమనించారు. వెంటనే ఆమె తన కాన్వాయ్‌ను అక్కడే ఆపించి, మైనర్లను సుతిమెత్తగా మందలించారు. వాహనాలను చట్ట విరుద్ధంగా మైనర్లకు ఇవ్వడం నేరమని గుర్తు చేసిన హోంమంత్రి, ఈ ఘటనను తల్లిదండ్రులకు తెలియజేయాలంటూ పోలీసులు ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ వాహనా లను నడిపే వయస్సు రాకముందే పిల్లలకు స్కూటీలు, బైకులు ఇవ్వడం వల్ల వారు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, సమాజంలోని రహదారి భద్రతకు ముప్పుగా మారు తుందని ఆమె వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆమె సూచించారు.