హిందీ దినోత్సవం సన్నాహక సమావేశం
అక్షరకిరణం, (పలాస): ఈనెల 14వ తేదీన నిర్వ హించే హిందీ దినోత్సవం సన్నాహక సమావేశం జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల కాశీబుగ్గలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందీ ఫోరం సభ్యులు శ్రీకాకుళం సభ్యులు సంతోష్, కిరణ్, భానుమూర్తి, జగన్, సూర్య హాజరై వివిధ సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమానికి పలాస, కాశీబుగ్గ హిందీ ఉపాధ్యాయులు సోమేశ్వరరావు, శ్రీనివాస్ బాబ్జీ, విష్ణు, చిన్నారావు, సీతారాం, విష్ణుమూర్తి, కల్పన, భాగ్యలక్ష్మి, ప్రమీల, సందీప్, శ్రీనివాస్, జోగారావు, వెంకటరావు, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.