రైల్వే ఉద్యోగులకు కేంద్రం పండగ శుభవార్త
క78 రోజుల బోనస్ ప్రకటన రూ.1865 కోట్లు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పండగ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏకంగా 78 రోజుల బోనస్ ప్రకటించింది. తాజాగా నిర్వహించిన కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు. ఇందుకోసం ఏకంగా రూ.1865 కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బోనస్‌తో 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం కలగనున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌కు మరోసారి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వరాల జల్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే శాఖకు కేంద్ర కేబినెట్ పండగ శుభవార్తను అందించింది. దీపావళి పండగ సందర్భంగా.. రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 78 రోజులకు గానూ రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు.. కేంద్ర మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. రైల్వే శాఖలో పనిచేస్తున్న 10,91,146 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు. ఒక్కో రైల్వే ఉద్యోగికి.. 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు.
ఈ రైల్వే ఉద్యోగుల బోనస్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1865.68 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రూప్ సీ, గ్రూప్ డీ కేటగిరీలోని లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఈ బోనస్ ప్రయోజనాలు అందించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
రైల్వే ఉద్యోగుల అద్భుతమైన పనితీరు, భారత రైల్వేలను మరింత ముందుకు నడిపించడంలో వారు చూపిస్తున్న అంకితభావాన్ని గుర్తించేందుకు ఈ బోనస్ ప్రకటిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయితే ఈసారి మాత్రమే కాకుండా గతేడాది కూడా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది రైల్వే ఉద్యోగులకు ఆర్థికంగా సహాయపడటంతో పాటు.. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.