హాఫ్ షోర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటూ గ్రీవెన్స్‌లో గౌతు శివాజీ వినతి
అక్షరకిరణం, (పలాస): దశాబ్దాలుగా నత్త నడకన నడుస్తున్న హాఫ్ షోర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ గ్రీవెన్స్‌లో మాజీ మంత్రి గౌతు శివాజీ కోరారు. హాఫ్షోర్పై మూడు నియోజకవర్గాల రైతులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అయినందున ఆఫ్సోర్ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరారు. పలాస నియోజకవర్గంలో హుద్ హుద్ తుఫాన్ సమయం లో ప్రజల కోసం నిర్మించిన హుద్‌హుద్ ఇళ్లు వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. తిత్లి తుఫాన్ టైంలో హెరిటేజ్ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని పలు విషయాలపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో మాజీ మంత్రి గౌతు శివాజీ కోరారు.