ఘనంగా గండి బాబ్జీ జన్మదిన వేడుకలు
అభిమానుల రక్తదాన శిబిరం
అక్షర కిరణం, (పెందుర్తి): ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, గండి బాబ్జి జన్మదిన వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పెందుర్తి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెందుర్తి బీజేపీ నాయకులు, జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని, రక్త దానం చేసిన దాతలకు ఎన్టీఆర్ బ్లడ్ సెంటర్ సర్టిఫికెట్స్ను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ రక్తదాన కార్యక్రమం లో బీజేపీ 95, 97వ వార్డుల సోషల్ మీడియా కన్వీనర్ వెంకట సంతోష్, ఉపాధ్యక్షులు కేవీఆర్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, సేనాపతి శంకర, తెలుగు యువత నాయకుడు దైలి రమణ, పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలనాయుడు, జ్యోతి, అయిత ఎర్నిబాబు, బీజేపీ 95, 97వ వార్డుల జనరల్ సెక్రెటరీ రాపర్తి దుర్గాప్రసాద్, సెక్రటరీ కొత్తపల్లి అప్పలరాజు, మరువాడ ప్రసాద్, ఒమ్మి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.