అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ కొరడా
అక్షర కిరణం, (మాధవధార): అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా రaలిపించారు. జీవీఎంసీ 51వ వార్డులో గల రాజీవ్ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా శాంతి నికేతన్ పాఠశాలపై నిర్మాణం చేపట్టిన అదనపు అంతస్తూ స్లాబ్‌ను మంగళవారం జీవీఎంసీ అధికారులు తొలగించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్మాణలు చేయాలని సూచించారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.అక్రమ నిర్మాణాలు చేపడితే టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచారం అందించాలని జీవీఎంసీ అధికారులు సూచించారు. జీవీఎంసీ పరిధిలో నిబంధనల కు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను సహించేది లేదన్నారు.