రహదారి ఆక్రమణలను తొలగించాలి
కజీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖ నగరంలో ప్రజలు, వాహనాల రాకపోకలకు రహదారుల ఆక్రమణలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని రోడ్లను ఆక్ర మించి నిర్వహిస్తున్న వ్యాపారాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటన లో భాగంగా 2 వ జోన్ 8వ వార్డు పరిధిలోని ఎండాడ పరిసర ప్రాంతాలను, త్రిబుల్ ఆర్ సెంటర్‌ను పరిశీలిం చారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ఎండాడ ప్రధాన రహదారిలో రోడ్డును ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాల ను గమనించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించా లని పట్టణ ప్రణాళికా అధికారులకు ఆదేశించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులతో కమిషనర్ మాట్లాడుతూ పరిధి దాటి రోడ్లపై వ్యాపారం చేయడం నేరమని, వాటిని స్వచ్చందంగా తొలగించుకోవా లని, జీవీఎంసీ విధించే జరిమానాలకు గురికావద్దని, ఆదే శించారు. ఎండాడ నుండి ఋషికొండ వరకు బీటీ రోడ్డు తోపాటు కాలువలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ తిరుపతిరావు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు, సీసీపీ ప్రభాకర్‌రావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, సీపీ ధనుంజయ రెడ్డి, డీసీపీ హరిదాసు, డీడీహిెచ్ దామోదర్‌రావు, హార్టికల్చర్ ఆఫీసర్ అర్చన, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, వార్డ్ కార్యదర్శులు, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.