పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
అక్షర కిరణం, (సాలూరు): స్వచ్ఛోత్సవ్, స్వచ్ఛతా హీ సేవ 2025 సఫాయిమిత్ర సురక్ష శిబిరం నిర్వహించారు. సాలూరు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ టీటీ రత్నకుమార్ అధ్యక్షతన పట్టణ శానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ, ప్రముఖ డాక్టర్ ప్రియాంక, మాధురి హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రజారోగ్య సిబ్బందికి పారిశుధ్య కార్మికుల కోసం ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. పారిశుధ్య కార్మి కుల ఆరోగ్యాన్ని పరీక్షించి, అవసరమైన మందులు అంది చారు. పారిశుధ్య కార్మికులకు రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స చేశారు. కార్యక్రమంలో పీపీ యూనిట్, డాక్టర్ ప్రియాంక, టీబీ సూపర్వైజర్ నరేష్, మున్సిపల్ డీఈ కార్యా లయ సిబ్బంది ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.