రూ 49 లక్షలతో సా:మాజిక భవనం
అక్షర కిరణం (గోపాలపట్నం):89 వ వార్డు పరిధి కొత్తపాలెంలో శిథిలమైన సామాజిక భవనం స్థానంలో జీవీఎంసీ నిధులు రూ : 49 లక్షలతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు పాలకవర్గ సభ్యులు అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే వార్డ్ టిడిపి అధ్యక్షులు బి విజయకుమార్, కూటమి నాయకులు స్థానిక పెద్దలు పబ్లిక్ వర్క్స్ ఏ ఈ వెంకటలక్ష్మి, సూపర్వైజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.