ప్రధాన రహదారుల్లోని ఆక్రమణలు తొలగించాలి
కజీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): నగరంలో ప్రధాన రహదారులలోని ఆక్రమణలను తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికా రులను ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యట నలో భాగంగా 2వ జోన్ 7వ వార్డు పరిధిలోని ఎండాడ రోడ్డు, మిథిలాపురి ఉడా కాలనీ ప్రధాన రహదారిని జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మితో కలిసి పరిశీలించారు. కమిష నర్ మాట్లాడుతూ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రధాన రహదారులలోని ఆక్రమణలు తొలగించాలని, అభివృద్ధి పరుస్తున్న ఎండాడ రోడ్డు, మిథిలాపురి ఉడా కాలనీ ప్రధాన రహదారిని పరిశీలించారు. రహదారిలో ఇంతవరకు పారి శుధ్య పనులు నిర్వహించడం లేదని కమిషనర్ ఆరా తీశారు. ముందు రోజు రహదారిలో ఆక్రమణలు తొలగించినందున సామగ్రి ఇంకా రోడ్లపై ఉందని అందుకు పారిశుధ్య పనులలో కొంత ఆలస్యం జరిగిందని కమిషనర్‌కు శానిటరీ ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు. ఈప్రాంతంలో ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని శానిటరీ ఇన్స్పెక్టర్ను, వార్డు సచివాలయం శానిటరీ కార్యదర్శిని అడిగి తెలుసుకొని పారిశుద్ధ్య పనులు నిర్వహణలో అశ్రద్ధ, అలసత్వం వహించరాదని నిత్యం రోడ్లను, వీధులను పరిశుభ్రపరచాలని కమిషనర్ ఆదేశించారు.
అనంతరం పలు ప్రాంతాల్లో పుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించినప్పటికీ అదే స్థానంలో మరలా తిరిగి వ్యాపారాలు నిర్వహిస్తుండడంపై కమిషనర్ దుకాణాదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాలను వెంటనే తొలగించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం 3వ జోన్ చిన్న వాల్తేర్‌లోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించి ఆహారపదార్థాల నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.