సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు: అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
అక్షర కిరణం, (సింహాచలం): ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్లతో కూడిన ఉన్నతాధికారుల బృందం మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలిం చింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే తొలి పావంచ ప్రాంతం తోపాటు మార్గమంతటా రోడ్లు, విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు, లైటింగ్ ఏర్పాట్లను అధికా రులు సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు, అండర్‌గ్రౌండ్ కేబులింగ్ పనులను, ముఖ్యంగా గోపాల పట్నంలోని రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి మార్గాన్ని సున్నితంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో నడిచే భక్తుల కోసం మార్గమంతటా తగినంత లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. తొలి పావంచ వద్ద ప్రధాన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను, మార్గంలో మరో 6 నుంచి 7 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మార్గంలో 30 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, 38 కీలక ప్రాంతాల్లో సీనియర్ అధికారులను విధుల్లో నియమిస్తున్నారు.
పారిశుధ్య, తాగునీరు, వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా అందు బాటులో ఉంటారు. గిరి ప్రదక్షిణ రోజుల్లో హెల్త్ సిటీ పరిది óలోని ఆసుపత్రులు అత్యవసర సేవలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, సాధారణ వైద్య ప్రక్రియలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
విజయనగరం, అనకాపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. హనుమంత వాక నుంచి మద్దిలపాలెం వరకు పాత జాతీయ రహదారి మార్గాన్ని పూర్తిగా ట్రాఫిక్ ఫ్రీ జోన్‌గా ప్రకటించారు. జోడుగు ళ్లపాలెం నుంచి అప్పుఘర్ బీచ్ రోడ్డులో ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆయా సంస్థల ను కోరుతామన్నారు. ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా భక్తులందరూ ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నా మని ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు స్పష్టం చేశారు.