దుర్గాలమ్మ ఆలయానికి పొటెత్తిన భక్తులు
కఏర్పాట్లు పర్యవేక్షించిన ఈవో
కఏర్పాట్లపై భక్తుల సంతృప్తి
అక్షర కిరణం, (విశాఖపట్నం): దుర్గమ్మ మా కష్టాలు తీర్చి, మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న శ్రీ దుర్గమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. నగరం నలుమూల ల నుంచి భవాని మాలలు వేసుకున్న భక్తులు, అమ్మ వారి భక్తులు బుధవారం తెల్లవారు జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరా రు. విశాఖపట్నంలో పూర్ణమార్కెట్ దగ్గర ఉన్న దుర్గాల మ్మ ఆలయానికి విశిష్టత ఉంది. నగరంలో పలుచోట్ల ఆలయాలు ఉన్న ఇక్కడకు వస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అమ్మ వారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రోజుకు సుమారు 5000 మంది భక్తులు అమ్మ వారి దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈవో శేఖర్ బాబు పరివేక్షణలో ఆలయం చుట్టూ భారీ కేడ్లు ఏర్పా టు చేశారు. తాగునీరు, భక్తులకు మధ్యాహ్నం ప్రసాద వితరణ నిర్వ హిస్తున్నారు. ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలతోపాటు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఈశరన్నవ రాత్రుల సందర్భంగా ఆలయానికి వీఐపీలు తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఆలయ ఈవో పైలా శేఖర్‌బాబు భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా దర్శనాల్లో ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని చెప్పారు. ఆమె కూడా ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ అలంకరణతో కన్నులకు ఆకట్టుకునే విధంగా అలంకరించారు.