వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి
కపెనమలూరు పర్యటనలో కాన్వాయ్‌కు ప్రమాదం కపలువురికి గాయాలు
అక్షర కిరణం, (పెనమలూరు): వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయిలో ప్రమాదం జరిగింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన చేపట్టారు. ఈ పర్యట నలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్ జగన్ కాన్వాయి లో ప్రమాదం జరిగింది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్ వాహనాలు ఒక దానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యా యి. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు వైఎస్ జగన్ గత పర్యటనల్లోనూ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోవటం అప్పట్లో రాజకీయంగా వివాదానికి కారణమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అప్పట్లో కూటమి ప్రభుత్వం, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. పోలీసులు ప్రమాదం తాలూకూ వీడియో కూడా విడుదల చేయటం.. ఈ వీడియోపైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అలాగే వైఎస్ జగన్ అనంతపురం పర్యటన కూడా వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. జగన్ రాప్తాడు పర్యటనలో అభిమానుల తాకిడికి హెలికాఫ్టర్ ధ్వంసమైంది. వైఎస్ జగన్‌ను చూడటానికి వందలాది వైసీపీ కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో రావటంతో పోలీసులు నియంత్రిం చలేకపోయారు. దీంతో అభిమానులు మీదపడడంతో వైఎస్ జగన్ వచ్చిన హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. ఈ ఘటన కూడా సంచలనం రేపింది. తాజాగా మరోసారి వైఎస్ జగన్ కాన్వాయిలో ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్తలు డీజేలు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు వీటిని అడ్డుకున్నారు. నిబంధనలు పాటించాలని సూచిం చారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు, పోలీసులకు మధ్యన వాగ్వాదం జరిగింది.